ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎం.ఎస్.రాజు దర్శకత్వంలో 'డ‌ర్టీ హ‌రి' చిత్రo

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 17, 2020, 10:40 AM

నిర్మాత ఎం.ఎస్.రాజు . ఆయ‌న  దర్శకత్వంలో తెర‌కెక్కిన ట్రెండీ ఫిల్మ్ `డ‌ర్టీ హ‌రి`. ఈ చిత్రాన్ని ఎస్.పి.జి. క్రియేషన్స్ పతాకం పై గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ నిర్మించారు. `డ‌ర్టీ హ‌రి`లో  శ్రవణ్ రెడ్డి హీరో. సిమ్రత్ కౌర్, రుహాణి శర్మ నాయిక‌లు.  రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ట్రైలర్  త్వరలో విడుదల చేయనున్నట్టు నిర్మాతలు తెలిపారు. బ్లాక్‌ బ‌స్ట‌ర్ రికార్డుల‌ను క్రియేట్ చేసిన ఎం.ఎస్‌.రాజు చిత్రాలు… `శత్రువు`, `దేవి`, `మనసంతా నువ్వే`, `ఒక్కడు`, `వర్షం`, `నువ్వొస్తానంటే నేనొద్దంటానా` వంటివ‌న్నీ ఒక ఎత్తు. ఇప్పుడు ఆయ‌న తెర‌కెక్కిస్తున్న `డ‌ర్టీ హ‌రి` మరో ఎత్తు.  రొటీన్ కథలకు స్వ‌స్తి చెప్పి… నేటి యూత్‌ను దృష్టిలో పెట్టుకుని ఆయ‌న తెర‌కెక్కించిన సినిమా `డ‌ర్టీ హ‌రి`. మన నిత్యం క‌లిసే మనుషుల్లో దాగి ఉండే ఆటవికత్వం, విచక్షనారహిత్యం వంటి అంశాల చుట్టూ క‌థ న‌డుస్తుంది. క‌ఠోర‌మైన వాస్త‌వాల‌ను అంతే సున్నితంగా తెర‌కెక్కించారు ఎం.ఎస్‌.రాజు. ఓ వైపు విష‌యాన్ని చెబుతూనే క‌థ‌లో వినోదాన్ని కూడా అద్భుతంగా మేళ‌వించారు.



 


 




 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa