గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్ ని వదులుకుని బాలీవుడ్ కి వెళ్లిపోయింది. హిందీ పరిశ్రమ తన సర్వస్వం అనుకుంది. అయితే అక్కడ పప్పులు ఉడకని సంగతి తెలిసిందే. అడపాదడపా హిట్లు దక్కినా పెద్ద రేంజ్ హీరోలు ఎవరూ ఆఫర్లు ఇవ్వలేదు. ఆ క్రమంలోనే ఇల్లీ స్వరం మార్చి తనకు తెలుగు సినీపరిశ్రమ తల్లితో సమానం అంటూ పొగిడేసింది. టాలీవుడ్ లో కంబ్యాక్ కోసం స్టార్ హీరోలకు ఫీలర్స్ వదిలింది. కానీ ఎవరూ పట్టించుకోలేదు.చివరికి మాస్ మహారాజా రవితేజ ఒక్క ఛాన్స్ ఇచ్చారు. `అమర్ అక్బర్ ఆంటోని` రిజల్ట్ ఏంటో తెలిసిందే. ఆ తర్వాత మరో ఆఫర్ లేనే లేదు. కనీసం హీరోయిన్లు దొరక్క సతమతమవుతున్నా వెటరన్ హీరోలు అయినా ఈ అమ్మడికి పిలిచి అవకాశం ఇవ్వడం లేదు.
ఎట్టకేలకు ఇలియానా ప్రయత్నం ఇన్నాళ్టికి ఫలించిందట. కింగ్ నాగార్జున సరసన తదుపరి చిత్రంలో అవకాశం దక్కించుకుందని తెలుస్తోంది. పీఎస్వి గరుడవేగ ఫేం ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. సీనియర్ నిర్మాత కం పంపిణీదారుడు నారాయణ్ దాస్- పుస్కూర్ రామ్ మోహన్ రావు- శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కాస్టింగ్ సెలెక్షన్ సహా ప్రీప్రొడక్షన్ సాగుతోంది. త్వరలోనే సినిమా ప్రారంభం కానుందని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa