స్టప్ట్ పోర్న్ స్టార్ హీరోయిన్ ఊర్మిళా మతోద్కర్ అని మరో హీరోయిన్ కంగనారనౌత్ చేసిన వ్యాఖ్యలపై పలువురు మండిపడ్డారు. బాలీవుడ్‌లో డ్రగ్స్ వాడకం గురించి ఊర్మిళ మాట్లాడుతూ.. `ఈ డ్రగ్స్ సమస్య దేశం మొత్తం ఉంది. మాదక ద్రవ్యాలకు తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ కేంద్ర బిందువు అని కంగనకు తెలుసా.. తన సొంత రాష్ట్రం గురించి కంగన ముందు ఆలోచించాలని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలపై కంగన ఫైర్ అయింది. ఓ ఆంగ్ల టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ ఊర్మిళపై అసభ్యకర కామెంట్స్ చేసింది. `ఊర్మిళ ఓ సాఫ్ట్ పోర్న్‌స్టార్. ఈ మాట కఠినంగా ఉండొచ్చు.. కానీ అదే నిజం. ఆమె గొప్ప నటి అని ఎప్పుడూ నిరూపించుకోలేదు. సాఫ్ట్ పోర్న్ తరహా పాత్రలు చేయడం తప్ప ఆమె చేసిందేముంది. ఆమె రాజకీయాల్లోకి రాగా లేనిది, నేను వస్తే తప్పేముంద`ని కంగన వ్యాఖ్యానించింది. కంగన వ్యాఖ్యలపై పలువురు బాలీవుడ్ నటులు ఫైర్ అయ్యారు. స్వర భాస్కర్, అనుభవ్ సిన్హా వంటి బాలీవుడ్ ప్రముఖులు ఊర్మిళకు మద్దతుగా ట్వీట్లు చేశారు. ఊర్మిళ గతంలో నటించిన సినిమాల గురించి ప్రస్తావించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa