`బిగ్‌బాస్-3` కార్యక్రమంలో పాల్గొని ఏడాది గడిచిపోయినా నిర్వాహకులు తనకు ఇంకా పారితోషికం ఇవ్వలేదని ప్రముఖ నటి కస్తూరి ఆరోపించారు. గత ఏడాది జరిగిన తమిళ `బిగ్‌బాస్` సీజన్ 3లో కస్తూరి పాల్గొన్నారు. అయితే ఒప్పందం ప్రకారం తనకు ఇవ్వాల్సిన పారితోషికం చెల్లించలేదని ఆమె తాజాగా ఓ ట్వీట్ చేశారు.
`అనాథపిల్లలకు ఆర్థికసాయం అందించడానికే నేను బిగ్‌బాస్ సీజన్-3లో పాల్గొన్నా. అయితే షో నిర్వాహకులు నాకు ఇవ్వాల్సిన పారితోషికం ఇంకా చెల్లించలేదు. నేనెప్పుడూ ప్రామిస్‌లను నమ్మను. అయితే `బిగ్‌బాస్` నిర్వాహకులు కూడా తప్పుడు ప్రామిస్‌లు చేస్తారని ఊహించ లేకపోయాన`ని కస్తూరి పేర్కొన్నారు. అక్టోబర్ నాలుగు నుంచి తమిళంలో `బిగ్‌బాస్-4` ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో కస్తూరి ఆరోపణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa