సోషల్ మీడియా కారణంగా సామాన్య ప్రజలు కూడా సెలబ్రిటీలకు ఎంత దగ్గరగా ఉంటారనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ అభిమాన హీరో, హీరోయిన్‌లతో సరదాగా చాట్ చేస్తూ ఫ్యాన్స్ పొందే ఆనందం అంతా ఇంతా కాదు. అయితే కొందరు ఆకతాయిలు మాత్రం సామాజిక మాధ్యమాలలో అసభ్య పదజాలంతో విపరీతమైన వ్యాఖ్యలు చేస్తుంటారు. దీని వలన సెలబ్రిటీలు పలు సందర్భాలలో చాలా ఇబ్బందికి కూడా గురయ్యారు. వీటిని దృష్టిలో పెట్టుకొని ఎంటీవి 'ట్రోల్ పోలీస్' పేరుతో ఓ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇందులో సోషల్ మీడియాలో ట్రోల్ అయిన వ్యక్తులను సెలబ్రిటీల ఎదురుగా కూర్చొపెట్టి వారి దగ్గరి నుండి వివరణ కోరే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా జరీన్ ఖాన్‌ని, ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని షోకి ఆహ్వానించారు నిర్వాహకులు. ఆ వ్యక్తిని చూడగానే ఆగ్రహంతో ఊగిపోయిన జరీనా ఖాన్ ‘నా చెయ్యి నీ ముఖం కంటే పెద్దది. కొట్టమంటావా? కొడితే పళ్లు రాలిపోతాయ్, అవి వెతుక్కోవడానికి చాలా సమయం పడుతుంది’ అంటూ తిట్టేసి, షో నుంచి సీరియస్‌గా వెళ్లిపోయింది. అయితే అంతకముందు ఆ వ్యక్తి జరీనా ఖాన్‌ని రేప్ చేస్తానని బెదరించాడట. అందుకు సీరియస్ అయిన జరీనా ఇలాంటి వ్యక్తులు చేసే చర్యలు పక్కవారిపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకోలేకపోతున్నారు. వీరి వలన సమాజానికి చాలా కీడు జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సంఘటనకి సంబంధించిన వీడియోని ఎంటీవీ తన ట్విట్టర్ ఎకౌంట్‌లో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది.
It's either "she got a break because she's a lookalike of another Bollywood actress" or "she's a fat aged aunty who doesn't know how to act." Trollers go to great lengths to make someone feel worthless. & they showed no mercy to @zareen_khan on social media either #MTVTrollPolice pic.twitter.com/WnqGe1RMpu
— MTV India (@MTVIndia) February 13, 2018
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa