సీనియర్ నటి, దర్శకురాలు విజయనిర్మల తన 73వ జన్మదినోత్సవాన్ని హైదరాబాద్‌లోని తన నివాసంలో అభిమానుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విజయనిర్మల స్పందిస్తూ…ఒకసారి దాసరిగారు మా ఇంటికొచ్చి…నా పుట్టినరోజు వేడుకలకు అభిమానులు రావడం చూసి సంతోషించారు. ఏ స్టార్ హీరోయిన్‌కూ ఈ స్థాయి క్రేజ్ లేదు అని అన్నారు. అదే నాకు పద్మభూషణ్‌తో సమానం ఈ వేడుకకు వచ్చిన అభిమానులందరికీ ధన్యవాదాలను తెలియజేస్తున్నా అని అన్నారు.
ఇదే వేడుకలో పాల్గొన్న సూపర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ, అక్కినేని నాగేశ్వరరావు, రజనీకాంత్, శివాజీగణషన్ వంటి స్టార్‌లతో సినిమాలు తీసిన ఏకైక దర్శకురాలు విజయనిర్మల. ఆమె తెరకెక్కిన 44 చిత్రాల్లో సగానికి పైగా సినిమాల్లో నేను నటించడం సంతోషంగా ఉంది. ప్రతీ ఏడాది ఈ విధంగా మా ఇంటికి విచ్చేసి, తమ అభిమానాన్ని చాటుకుంటున్న అభిమానులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. గిన్నిస్ బుక్ వారు గౌరవించిన విజయనిర్మలను భారత ప్రభుత్వం తగిన రీతిలో సత్కరిస్తుందని ఆశిస్తున్నా అని అన్నారు. సీనియర్ నరేష్ మాట్లాడుతూ, మా కుటుంబ సభ్యులందరి పుట్టినరోజులకు ఈ విధంగా అభిమానులు విచ్చేయడం చాలా సంతోషంగా ఉంటుంది. ఎలాంటి స్వార్థం లేకుండా కేవలం అభిమానంతో ఇక్కడికి విచ్చేయడం ఆనందదాయకం అని అన్నారు. నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ, దాసరి, బాపు వంటి టాప్ డైరెక్టర్ల మొదటి చిత్రాల హీరోయిన్ విజయనిర్మలగారే. అలాగే స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన విజయశాంతిని కిలాడికృష్ణుడు చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం చేసింది కూడా విజయనిర్మలగారే అని చెప్పారు. ఇంకా ఈ పుట్టినరోజు వేడుకల్లో అభిమానులతో పాటు పలువురు ప్రముఖ నటీనటులు పాల్గొన్నారు. కాగా తన పుట్టినరోజు సందర్భంగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు విజయనిర్మల 73 వేల రూపాయల చెక్కును అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa