టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వచ్చిన 'నేల టికెట్' గుర్తుండే ఉంటుంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజ సరసన మోడల్ మాళవిక శర్మ నటించింది.ఈ సినిమాలో మాళవిక తన అందాలతో అదరగొట్టిన.. సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టడంతో.. ఈ భామ ఎవరికీ తెలవకుండా పోయింది. అయితే అమ్మడు అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. తన సూపర్ ఫిగర్‌తో ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. కుర్రకారుకు మతులు పోయేలా చేస్తోంది. తాజాగా ఈ భామ రామ్ 'రెడ్'లో నటించింది. కాగా ఈరోజు తన 23వ పుట్టిన రోజును జరుపుకుంటోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa