తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్‌కి సంబంధించిన ఐదో సీజన్ త్వరలోనే ప్రారంభం కాబోతున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో బాగా టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే పనులు కూడా ప్రారంభం అయినట్లు సమాచారం. హోస్ట్‌గా నాగార్జున కొనసాగుతున్నట్లు తెలుస్తుండగా.. కంటెస్టెంట్‌ల కోసం ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నారట నిర్వాహకులు. మరోవైపు ఈ సీజన్‌లో పేరు మోసిన వారిని తెచ్చేందుకు వారు ప్రయత్నిస్తున్నారట ఈ క్రమంలో కొంతమంది పేర్లు ఇప్పుడు వినిపిస్తున్నాయి.
యాంకర్‌గా మంచి పేరును సంపాదించుకున్న రవి ఈసారి బిగ్‌బాస్‌లో పాల్గొనబోయే కంటెస్టెంట్‌ల లిస్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రవితో పాటు యాంకర్లుగా పనిచేసిన శ్రీముఖి, లాస్యలు బిగ్‌బాస్‌కి వెళ్లి వచ్చారు. ఈ క్రమంలో రవి పేరు బాగా వినిపిస్తోంది. జబర్దస్త్‌లో తనదైన పంచ్‌లతో రెచ్చిపోయే హైపర్ ఆదిని బిగ్‌బాస్ 5లోకి తెచ్చేందుకు నిర్వాహకులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. బయట ఈ కమెడియన్‌కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలో హైపర్ ఆది పేరు ఇప్పుడు బిగ్‌బాస్ 5 కోసం వినిపిస్తోంది. టిక్‌టాక్ ద్వారా మంచి ఫేమ్‌ని సంపాదించుకున్నాడు దుర్గారావు. ముఖ్యంగా టిక్‌టాక్‌లో నక్కిలీసు పాటకు ఆయన వేసిన స్టెప్పులు బాగా ఫేమస్ అయ్యాయి. దీంతో దుర్గారావుకు మంచి ఫేమ్ రావడంతో పాటు ఇప్పుడిప్పుడు సినిమాల్లో కూడా అవకాశాలు తెచ్చుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇతడి పేరు బిగ్‌బాస్ 5 కోసం వినిపిస్తోంది.
2020లో దక్షిణాదిన మోస్ట్ ఇన్ఫ్లూయెన్సియల్ లిస్ట్‌లో స్థానం సంపాదించుకున్న యూట్యూబర్ షణ్ముక్ జశ్వంత్ పేరు బిగ్‌బాస్ 5 కోసం వినిపిస్తోంది. ఆయన నటించిన సాఫ్ట్‌వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ మంచి వ్యూస్‌ని రాబట్టింది. ఇక ఇప్పుడు షణ్ముఖ్‌కి మంచి ఆఫర్లు వస్తుండగా.. అతడు కూడా ఈ రియాలిటీ షోలో పాల్గొనేందుకు ఎదురుచూస్తున్నట్లు సమాచారం. బుల్లితెరపై హాట్ యాంకర్‌గా పేరు సంపాదించుకున్న వర్షిణి పేరు బిగ్‌బాస్ 5కోసం వినిపిస్తోంది. ప్రస్తుతం స్టార్ మాలో కామెడీ స్టార్స్ అనే షోలో మాత్రమే చేస్తున్న వర్షిణికి బయట అభిమానులు బాగానే ఉన్నారు. ఈ క్రమంలో ఆమెను బిగ్‌బాస్‌కి తీసుకొచ్చే ప్లాన్‌లో నిర్వాహకులు ఉన్నట్లు తెలుస్తోంది.
యూనిక్ వాయిస్‌తో మంచి సింగర్‌గా దూసుకుపోతున్న మంగ్లీ పేరు కూడా బిగ్‌బాస్ 5 కోసం వినిపిస్తోంది. బిగ్‌బాస్ 4 కోసం కూడా మంగ్లీ పేరు వినిపించినప్పటికీ.. ఆమె ఆ సీజన్‌లో పాల్గొనలేదు. ఇక ఈ సీజన్ కోసం ఆమెను తీసుకొచ్చేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. టిక్‌టాక్ ద్వారా మంచి ఫేమ్‌ని సంపాదించుకున్న దీపికా పిల్లి.. ఇప్పుడు ఢీ షోలో మెంటార్‌గా ఉంది. ఇప్పుడు ఆమె పేరు కూడా బిగ్‌బాస్ 5 కోసం వినిపిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa