యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ రీసెంట్‌గా ఉన్నది ఒక్కటే జిందగీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఇక తన తదుపరి ప్రాజెక్ట్ సినిమా చూపిస్తా మామ, నేను లోకల్ ఫేమ్ త్రినాథ్ రావ్ నక్కిన దర్శకత్వంలో చేయబోతున్నాడు రామ్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం కొద్ది సేపటి క్రితమే లాంచ్ అయింది. నాగార్జున, అమల జంటగా నటించిన 'నిర్ణయం'లో సూపర్ హిట్ సాంగ్ 'హలో గురు ప్రేమ కోసమే’ అనే పల్లవిని ఈ చిత్రానికి టైటిల్ గా నిర్ణయించారు. ఫన్ అండ్ లవ్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ చిత్రంలో రామ్ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించనుంది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటించనున్నాడు. విజయ్ కె చక్రవర్తి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్నారు. గతంలో రామ్, దిల్ రాజు కాంబినేషన్‌లో ‘రామ రామ కృష్ణ కృష్ణ’ అనే సినిమా రూపొందిన విషయం విదితమే. రామ్ 16వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రేక్షకులు మెచ్చేలా ఉంటుందని యూనిట్ తెలియజేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa