ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజేంద్ర ప్రసాద్ పిసినారి పాత్రలో 'ఎఫ్ 3' మూవీ

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 07, 2021, 11:46 AM

టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్ లతో కలిసి ‘ఎఫ్ 3’ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ పిసినారి పాత్రలో కనిపించబోతున్నాడని, జంధ్యాల అహన పెళ్ళంట సినిమాలోని కోట పాత్రను కమటిన్యూ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో అనిల్ రావిపూడి ఈ పాత్రను రాశాడట. ఈ పాత్ర ఈ సినిమాకే హైలైట్ గా నిలుస్తోందట.ఎఫ్ 3 చిత్రంలో రాజేంద్ర‌ప్ర‌సాద్‌ని పిసినారిగా చూపించి ఫ‌న్ అందించే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. రాజేంద్ర ప్ర‌సాద్ పాత్ర సినిమాకే హైలైట్‌గా ఉంటుంద‌ని టాక్. క‌రోనా సెకండ్ వేవ్ వ‌ల‌న ఆగిన చిత్ర షూటింగ్ మ‌రి కొద్ది రోజుల‌లో సార‌ధి స్టూడియోలో ప్రారంభం కానుంది. ఈ సీక్వెల్ లో కూడా త‌మ‌న్నా, మెహ‌రీన్‌లే క‌థానాయిక‌లుగా న‌టించబోతున్నారు. వీళ్ళు వెంకీ వరుణ్ లను పెట్టే టార్చర్ వల్లే.. వాళ్ళ జీవితాలు డబ్బులు చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. మొత్తానికి భార్యల టార్చరే ఎఫ్ 3 కథకు మెయిన్ మోటివ్ అని సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa