ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'డియర్‌ మేఘ' సినిమా రివ్యూ

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 03, 2021, 04:20 PM

మేఘా ఆకాష్‌, అరుణ్ అదిత్‌, అర్జున్ సోమయాజులు ప్రముఖ పాత్రల్లో నటించిన సినిమా 'డియర్‌ మేఘ'. ఈ సినిమా ఈరోజు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు సంగీతం హరి గౌర అందించారు. ఎ.సుశాంత్ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు.


'డియర్ మేఘ' సినిమా కన్నడలో హిట్ అయిన 'దియా'కు రీమేక్‌గా రూపొందింది. కథలోకి వెళ్తే మేఘ స్వరూప్ (మేఘా ఆకాష్‌) కాలేజీలో తన సీనియర్ అర్జున్ (అర్జున్ సోమయాజులు)ని ప్రేమిస్తుంది. కానీ ఆ విషయాన్ని అతనికి చెప్పదు. ఈలోపు అర్జున్ కాలేజీ వదిలి సింగపూర్ వెళ్లిపోతాడు. మూడేళ్ల తర్వాత అర్జున్ ముంబైలో మేఘను కలిసి కాలేజీ రోజుల్లోనే తాను కూడా ప్రేమించినట్లు చెప్తాడు. ఇద్దరూ ప్రేమలో మునిగిపోతారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదంలో అర్జున్ మేఘకు దూరమవుతాడు. అతన్ని మర్చిపోలేక మేఘ సూసైడ్ చేసుకోవాలనుకుంటుంది. ఆ సమయంలో ఆమె జీవితంలోకి ఆది(అరుణ్ అదిత్) వస్తాడు. వారి మధ్య స్నేహం ప్రేమగా మారుతున్న సమయంలో అర్జున్ బతికే ఉన్నాడని తెలుస్తుంది. ఆ తర్వాత కథ ఎలాంటి మలుపు తిరిగింది? అర్జున్ , ఆదిలలో మేఘ ఎవరి ప్రేమను దక్కించుకుందో తెలియాలంటే ఈ సినిమా చూడాలి.


ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. దర్శకుడు సుశాంత్ రెడ్డి టేకింగ్ బాగుంది. హరిగౌర పాటలు, నేపథ్య సంగీతం డియర్ మేఘాకు బలాన్ని చేకూర్చాయి. సాంకేతికంగా, నిర్మాణ పరంగా డియర్ మేఘా ఫర్వాలేదనిపిస్తుంది.


ప్లస్ పాయింట్స్:


- మేఘ, అరుణ్‌ల నటన
- సాంగ్స్


మైనస్ పాయింట్స్:
- స్టోరీ
- నెమ్మదిగా సాగే కథనం






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa