ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ కి 40 మిలియన్ వ్యూస్!

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 29, 2021, 08:31 AM

సాగర్ కే చంద్ర దర్శకత్వం లో పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రం నుండి విడుదలైన మేకింగ్ వీడియో, ఫస్ట్ గ్లింప్స్ మరియు ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ చిత్రం నుండి విడుదల అయిన ఫస్ట్ సింగిల్ యూ ట్యూబ్ లో ఇంకా టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ ఫస్ట్ సింగిల్ కి 40 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంతేకాక 1.2 మిలియన్ లైక్స్ రావడం విశేషం. పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం లో నిత్యా మీనన్ హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa