ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నచ్చితేనే చేస్తా, అందుకే ఆ సినిమా వదిలేశా: ఇలియానా

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 04, 2018, 11:08 AM

టాలీవుడ్‌లో ఒకప్పుడు ప్రముఖ హీరోయిన్‌గా చెలామణి అయిన ఇలియానా ఇప్పుడు బాలీవుడ్‌లో బాగా బిజీ అయ్యింది. తాజాగా విడుదలైన ‘రైడ్’ సినిమాతో ఆమె హ్యాట్రిక్ విజయాలు అందుకుంది. ఆమె గతేడాది నటించిన ‘ముబార్కన్’, ‘బాద్షాహో’ సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి. దీంతో, అమ్మడి ఆనందానికి అవధులు లేవు. 


ఈ సందర్భంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ‘‘చాలామంది నన్ను నీ సినిమాలు పరాజయం చూస్తే ఎలా ఫీలవ్వుతావు అని అడుగుతారు. అయితే, నేను నా సినిమా విజయం సాధించినప్పుడు ఎలా ఉంటానో, పరాజయం పాలైనప్పుడు కూడా అలాగే ఉంటాను. ఆ సినిమా బాగా ఆడిన, ఆడకున్నా.. దాన్నే పట్టుకుని వేలాడను. ముందుకు వెళ్లిపోతాను’’ అని తెలిపింది. 2012న ‘బర్ఫీ’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచమయ్యారు. ఇప్పుడు బాలీవుడ్‌లో కెరీర్‌ను నిర్మించుకుంటున్నారనే ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘చెప్పాలంటే, నేను ఆశించిన దాని కంటే బాలీవుడ్ కెరీర్ నెమ్మదిగానే సాగింది. కానీ, ఇందుకు ఆందోళన లేదు. ఎందుకంటే, ఇప్పటివరకు నేను నాకు ఇష్టమైన నిర్ణయాలే తీసుకున్నా’’ అని పేర్కొంది. 


‘అవకాశం వచ్చిన ప్రతి సినిమాకు నేను సంతకాలు చేయలేదు. స్టోరీ, పాత్రలు నచ్చక చాలా సినిమాలు నేను రిజెక్ట్ చేశా. కొన్నిసార్లు, స్టోరీ చాలా మంచిగా అనిపించినా, నా పాత్ర నచ్చక ఆ సినిమాలు వదులుకునేదాన్ని’’ అని తెలిపింది. ఆ సినిమా అందుకే చేయలేదు: 2013లో ‘స్పెషల్ చబ్బీస్’ ఈ సినిమా తెలుగులో ‘గ్యాంగ్’గా రీమేక్ అయ్యింది సినిమాలో అవకాశం వచ్చింది. దీనిపై దర్శకుడు నీరజ్ పాండేతో మాట్లాడా. స్టోరీ నాకు చాలాబాగా నచ్చింది. కానీ, అందులో నా పాత్రకు ప్రాధాన్యం ఉంటే బాగుంటుందని అనిపించింది. దీంతో.. ‘‘నా పాత్ర పెంచాలని నేను డిమాండు చేయను. ఎందుకంటే, సినిమాలో మీరు అనుకున్న విధంగా తీస్తేనే బాగుంటుంది’’ అని డైరెక్టర్‌కు చెప్పి, రిజెక్ట్ చేశానని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa