ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నీహారికకు అంత పెద్ద ఛాన్సొచ్చిందా?

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 04, 2018, 11:29 AM

మెగా బ్రదర్ నాగేంద్ర బాబు కూతురు నీహారిక కొణిదెల.. సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఒక మనసు మూవీతో హీరోయిన్ గా మారిన ఈమె.. ఆ తర్వాత మళ్లీ తెలుగు సినిమా ఏదీ చేయలేదు. ఓ తమిళ్ మూవీలో నటించినా తెలుగుకు వచ్చేసరికి చాలా అలర్ట్ గా ఉంటోంది.అయితే.. ఇప్పుడీమె చాలా పెద్ద ఆఫర్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డిలో ఈమెకు ఓ కీలకమైన పాత్రను ఇచ్చారట. పెదనాన్న సినిమాలో ఓ పాత్ర చేయాలనే ఆఫర్ వినగానే ఎగిరి గంతేసినంత పని చేసిందట మెగా డాటర్. ఓ కీలకమైన పాత్రలో నీహారిక కనిపించనుందని అంటున్నారు. టాలీవుడ్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సింగిల్ ఫిలిం సైరా. దాదాపు 250 కోట్లను ఈ సినిమా కోసం వెచ్చిస్తున్నాడు నిర్మాత రామ్ చరణ్. అంతటి పెద్ద ప్రాజెక్టులో నటించే ఆఫర్ అందడంపై చాలా సంతోషంగా ఉంది నీహారిక.


సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సైరా చిత్రంలో నీహారికకు ఆఫర్ చేసిన పాత్ర.. సినిమాలో అత్యంత కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. పెర్ఫామెన్స్ బేస్డ్ రోల్ కావడంతో ఈ క్యారెక్టర్ కు నీహారికను తీసుకోవాలనే ప్రపోజల్ పెట్టాడట దర్శకుడు. దీనికి చిరు అండ్ టీం నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో.. సైరా లో నీహారిక ఎంట్రీ ఖాయం అయిపోయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa