వివాదాస్పద నటి శ్రీరెడ్డి వ్యవవహారం అనేక మలుపులు తిరుగుతోంది. శ్రీరెడ్డి లీక్స్ పేరుతో ఆమె రోజుకో పేరు బయటపెడుతూ వివాదాలకు తెర తీస్తోంది. మొన్న ఓ నిర్మాత పేరు, నిన్న ఓ డైరెక్టర్ పేరు చెప్పి సంచలనం సృష్టించింది. ఇలా లీక్స్‌తో రెచ్చిపోతుండటంతో టాలీవుడ్ పెద్దలు ఈ వ్యవహరాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. అందుకే ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించారు. ఇండస్ట్రీ ప్రముఖులు, నటుల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. టాలీవుడ్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్న ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు.
టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ ఫిర్యాదు చేశారు. కంప్లైట్‌ను పరిశీలించిన పోలీసులు... న్యాయ నిపుణుల్ని సంప్రదిస్తున్నారు. వారి సలహా మేరకు కేసు నమోదు చేసే అంశంపై నిర్ణయం తీసుకుంటామంటున్నారు. మరి ఈ ఫిర్యాదుపై శ్రీరెడ్డి ఎలా స్పందిస్తున్నది ఆసక్తిగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa