ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘రంగస్థలం’ కథ విన్నప్పుడు రామ్‌చరణ్‌ హీరో అనే విషయం నాకు తెలియదు

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 05, 2018, 12:58 PM

2009లో ‘ఆర్య 2’లో నటించమని సుకుమార్‌గారు అడిగినప్పుడు చేయలేకపోయా. ఆయన ‘రంగస్థలం’ కథ చెప్పినప్పుడు రంగమ్మత్త పాత్రలో ప్రేక్షకులు నన్ను యాక్సెప్ట్‌ చేస్తారా? లేదా? అనే భయం ఉన్నా ధైర్యం చేసి చేశా. ఈ రేంజ్‌లో పాజిటివ్‌ ఫీడ్‌బ్యాక్‌ వస్తుందని ఊహించలేదు’’ అన్నారు నటి అనసూయ. రామ్‌చరణ్, సమంత జంటగా సుకుమార్‌ దర్శకత్వంలో నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సి.వి.ఎం (మోహన్‌) నిర్మించిన ‘రంగస్థలం’ గత శుక్రవారం విడుదలైంది.  ఈ చిత్రంలో రంగమ్మత్త పాత్రలో ప్రేక్షకులను అలరించిన అనసూయ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ –‘‘నా విజయ రహస్యం అంటూ ప్రత్యేకించి ఏమీ లేదు. నన్ను నేను ఎప్పుడూ ఎక్కువ అనుకోను.


తక్కువ చేసి చూసుకొంటాను. అందుకే నాకు లభించిన ప్రతి అవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకొని ప్రేక్షకుల్ని మెప్పించగలిగాను. నేను ఒకే ఇమేజ్‌లో కూరుకుపోవాలనుకోవడం లేదు. ప్రకాశ్‌ రాజ్‌గారిలా అన్ని పాత్రలూ చేయాలనీ, కరెక్ట్‌గా చెప్పాలంటే ‘లేడీ ప్రకాశ్‌ రాజ్‌’లా అవ్వడం నా ధ్యేయం. ‘రంగస్థలం’ కథ విన్నప్పుడు రామ్‌చరణ్‌ హీరో అనే విషయం నాకు తెలియదు. తెలిసాక ‘చరణ్‌తో అత్త అని పిలిపించుకోవాలా.. కనీసం రంగమ్మ అని అయినా పిలిపించండి’ అని సుకుమార్‌గారిని రిక్వెస్ట్‌ చేశా. ‘రంగస్థలం’ సినిమా చూశాక ‘నటిగా ఎదిగావ్‌ అనసూయ’ అని మా ఆయన చెప్పడం ఎప్పటికీ మరువలేను. నాకు లభించిన బెస్ట్‌ కాంప్లిమెంట్‌ అది’’ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa