ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్‌ఖాన్ దోషీ

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 05, 2018, 12:06 PM

కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌‌ను జోథ్‌పూర్‌ కోర్టు దోషిగా తేల్చింది. మిగతా ఐదుగురు నటులను నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసుకు సంబంధించి మార్చి 28నాటికి తుది వాదనలు పూర్తయ్యాయి. అయితే చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ దేవ్‌కుమార్ కత్రి తీర్పును వాయిదా వేశారు. ఈరోజు కేసు విచారణకు రాగా సల్మాన్‌ఖాన్‌ను కోర్టు దోషిగా తేల్చింది.


 1998 అక్టోబర్‌లో జరిగిన ఓ షూటింగ్ సందర్భంగా జోథ్‌పూర్ సమీపంలోని కంకణి గ్రామంలో కృష్ణజింకలను హతమార్చినట్లు సల్మాన్‌పై కేసు నమోదు అయ్యింది. ఇందులో సల్మాన్ ఖాన్‌పై వన్యప్రాణి సంరక్షణ చట్టం సెక్షన్ 51కింద కేసు నమోదు చేశారు. ఇతర నటులపై సెక్షన్ 149కింద కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో తీర్పు వెల్లడించిన కోర్టు సల్మాన్‌ను దోషిగా తేల్చుతూ.. మిగతా ఐదుగురు నటులను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది.  జింకల వేట కేసులో ఈరోజు తీర్పు సందర్భంగా సల్మాన్‌ఖాన్‌తో పాటు సైఫ్ అలీఖాన్, టబూ, సొనాలిబింద్రే, నీలం తదితరులు జోథ్‌పూర్ కోర్టుకు చేరుకున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa