రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన మోస్ట్ ఎవైటెడ్ చిత్రం "RRR" విడుదలవా యిదా పడడంతో అందరి దృష్టి ఇప్పుడు సంక్రాంతికి రాబోయే ఇతర చిత్రాలపై ఉంది. ఈ నేపథ్యంలో ముందుగా చెప్పినట్లుగానే జనవరి 12న 'భీమ్లా నాయక్' విడుదల కానుందని ఊహాగానాలు మొదలయ్యాయి.అయితే రీసెంట్ గా ఓ యంగ్ హీరో సంక్రాంతి రేసులోకి రావడంతో 'భీమ్లా నాయక్' సినిమా బరిలోకి దిగడం లేదు అని తెలుస్తుంది . వాల్పేపర్ రింగ్. ఎందుకంటే 'భీమ్లా నాయక్' చిత్రాన్ని నిర్మించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ 'డీజే టిల్లు' చిత్రాన్ని నిర్మించింది. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ఈ చిత్రానికి విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్నట్టు ఇటీవల ప్రకటించారు. దీంతో "భీమ్లా నాయక్" తాను సంక్రాంతి రేసులోకి రానని చెప్పకనే చెబుతున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa