తెలుగు సినిమా పరిశ్రమ సంక్రాంతిని నమ్ముకొని ప్రతి సారి ఎన్నో సినిమాలు విడుదల అవ్వడం చూస్తూనే ఉన్నాం . కానీ ఇప్పుడు సంక్రాంతి మాత్రం పెద్ద సినిమాలు ఏవి లేవనే చెప్పాలి. RRR వాయిదా పడిన సమయంలో ఇంకా ప్రభాస్ రాధే శ్యాం మాత్రమే అని అనుకున్నారు అభిమానులు. ఐతే ఇప్పుడు పెరుగుతున్న కరోనా కేసుల వలన ఈ సినిమా కూడా వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు సోషల్ మీడియా ద్వారా తెలియ చేసారు. ఈ సినిమా నిర్మాతలు U.V. క్రియేషన్స్ వారు
"ప్రస్తుతం కొనసాగుతున్న కోవిడ్ పరిస్థితుల కారణంగా మా సినిమా #రాధేశ్యామ్ విడుదలను వాయిదా వేయవలసి వచ్చింది. మీ బేషరతు ప్రేమ మరియు మద్దతు కోసం అభిమానులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు.
త్వరలో సినిమాల్లో కలుద్దాం..!" అంటూ తెలియ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa