నందమూరి బాల కృష్ణ హీరోగా నటించి విడుదలైన సినిమా అఖండ ఎంత పెద్ద హిట్ గ మారిందో చెప్పాల్సిన పని లేదు. ఐతే సక్సెస్ ని ఎంజాయ్ చెయ్యడమే కాకుండా మల్లి వెంటనే ఇంకో సినిమాకి ఓకే చెప్పారు బాలయ్య. గోపి చంద్ మలినేని డైరెక్షన్ లో చేస్తునట్టు చెప్పడం జరిగింది. ఈ సినిమా తారాగణం కి సంబంధించి చాల మంది ప్రముఖులను ఇందులో చేర్చినట్లు తెలుస్తుంది. నిన్న కన్నడ స్టార్ దునియా విజయ్ ఈ సినిమాలో ప్రతి నాయకుడుగా నటిస్తున్నాడు అని చెప్పిన ఈ టీం ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో క్రాక్ సినిమాలో జయమ్మ గా మనందరినీ ఆకట్టుకున్న "వరలక్ష్మి శరత్ కుమార్" నటిస్తున్నట్లు తెలియ చెప్పారు. ఈమె రాకతో ఈ సినిమా భారీ స్థాయికి వెళ్ళింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి తొలిసారి చేస్తున్న ఈ ప్రయత్నంలో ఎంత వరకు సక్సెస్ అవుతారో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa