టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. తాజాగా 'ఖిలాడీ' సినిమా హీరోయిన్ డింపుల్ హయాతి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొంది. ఈ మేరకు ఆమె మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డింపుల్ హయాతి మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ఛాలెంజ్ కొనసాగింపులో భాగంగా హీరో రవితేజ, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, హీరోయిన్ మీనాక్షి చౌదరి, దర్శకుడు రమేష్ వర్మ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని స్వీకరించి మొక్కలు నాటాలని డింపుల్ హయాతి ఛాలెంజ్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa