ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'విక్రమ్' మూవీతో సీక్రెట్ ఏజెంట్ గా రానున్న కమల్

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 03, 2022, 08:25 PM

కమలహాసన్ కథానాయకుడిగా 'విక్రమ్' సినిమా రూపొందింది. కమల్ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో కమల్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్నారు. అయితే ఆయన పాత్రను మలిచిన తీరు భిన్నంగా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని అంతా ఆసక్తిని .. ఆత్రుతను కనబరుస్తున్నారు. ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేయనున్నారనే ప్రకటనను, ఈ నెల 14వ తేదీన ఉదయం 7 గంటలకు చేస్తారట. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారనే విషయం తెలిసిందే. డిఫరెంట్ లుక్ తో కమల్ కనిపించనున్న ఈ సినిమాలో, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, నరేన్ కీలకమైన పాత్రలను పోషించారు. ఈ మూడు పాత్రలు కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ కి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని సమకూర్చాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa