శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. ఈ మూవీ నుంచి టైటిల్ వీడియో సాంగ్‌ను దగ్గుబాటి రానా విడుదల చేశాడు. ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించడంతోపాటు అతడే పాడాడు. ఈ సినిమాకు తిరుమల కిశోర్ దర్శకత్వం వహించగా రష్మిక మందాన హీరోయిన్‌గా నటించింది. ఆడవాళ్ళు మీకు జోహార్లు శుక్రవారం విడుదల కానుంది. అయితే ఈ సినిమాలో ఎమోషన్స్ తక్కువ. సరదాగా ... సందడిగా సాగే కామెడీ సన్నివేశాలు ఎక్కువ.
శర్వానంద్ కొంతకాలంగా వరుస ఫ్లాపులతో ఉంటే, రష్మిక వరుస సక్సెస్ లతో ఉంది. అందువలన ఈ ఇద్దరూ కలిసి చేసిన ఈ సినిమాపై అందరిలో ఆసక్తి ఉంది. రాధిక .. ఖుష్బూ .. ఊర్వశి ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను ఈ నెల 4వ తేదీన విడుదల చేయనున్నారు. ఎలాంటి రిజల్టును రాబడుతుందో చూడాలి మరి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa