ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'రాధేశ్యామ్' మేజర్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 09, 2022, 06:45 PM

రాధాకృష్ణ డైరెక్షన్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అండ్ సిజ్లింగ్ క్వీన్ పూజహెడ్జ్ నటించిన 'రాధేశ్యామ్' సినిమా మర్చి 11న  విడుదల కానుంది.రొమాంటిక్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమా ప్రొమోషన్స్ ని మేకర్స్ దేశవ్యాప్తంగా ప్రారంభించారు.లేటెస్ట్ అప్డేట్ ప్రకారం,'రాధేశ్యామ్' సినిమా నుంచి 12 నిమిషాలను మేకర్స్ ట్రిమ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ విషయం గురించి మూవీ మేకర్స్ ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ,టిక్కెట్ బుకింగ్ వెబ్‌సైట్‌లలో చూస్తే కంఫర్మ్ అవుతుంది.కొన్ని వారాల క్రితం,'రాధే శ్యామ్' సినిమా సెన్సార్ సర్టిఫికేట్ సోషల్ మీడియాలో లీక్ అయినప్పుడు,దాని రన్-టైమ్ 150 నిమిషాలుగా ఉంది.కానీ తాజాగా ఇప్పుడు,138 నిమిషాలకు సవరించబడింది.ఈ సినిమాలో జగపతిబాబు,కృష్ణంరాజు,భాగ్యశ్రీ,సత్యరాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.యువి క్రియేషన్స్ ఈ హై బడ్జెట్ సినిమాని నిర్మిస్తుంది.ఈ పీరియడ్ రొమాంటిక్ డ్రామాకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa