ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామ్ చరణ్ 'RC15'కి టైటిల్ లాక్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 09, 2022, 06:48 PM

సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'RC15' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం,ఈ సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరుగుతోంది అని మేకర్స్ ప్రకటించారు.తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ కథానాయికగా నటిస్తోంది.తమిళ నటుడు ఎస్‌జే సూర్య విలన్‌గా నటిస్తుండగా,సునీల్,శ్రీకాంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం,ఈ చిత్రానికి 'RC15' మూవీ మేకర్స్ 'సర్కారోడు' అనే టైటిల్‌ను లాక్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.మార్చి 27న రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ టైటిల్ ని అనౌన్స్ చేయనున్నారు అని సమాచారం.2023 సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ చేయాలనీ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa