యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ 'స్టాండ్ అప్ రాహుల్' సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.సంతో మోహన్ వీరంకి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బబ్లీ బ్యూటీ వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో రాజ్ తరుణ్ స్టాండ్ అప్ కామిక్ పాత్రలో నటించాడు.వెనిల్లా కిషోర్,దేవి ప్రసాద్,మధురిమ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజాగా మూవీ మేకర్స్ ఈరోజు ప్రమోషనల్ సాంగ్‌ను విడుదల చేసారు.రాజ్ తరుణ్ మరియు వర్షా బొల్లమ్మ ఈ ప్రమోషనల్ సాంగ్ లో ఫుల్ ఎనర్జీ తో డాన్స్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు.రికార్డింగ్ స్టూడియోలో రోల్ రిడా,స్వీకర్ అగస్తీ అండ్ దర్శకుడి మధ్య జరిగిన చర్చలు కూడా ఈ వీడియోలో చూపించారు.ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ ప్రచారం జోరందుకుంది అని చెప్పొచ్చు.డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్లపై నందకుమార్ అబ్బినేని అండ్ భరత్ మాగులూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.మార్చి 18,2022 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ చిత్రానికి స్వీకర్ అగస్తి సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa