ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'RRR' నుండి మార్చి 14న విడుదల కానున్న ఎత్తరా జెండా సాంగ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 11, 2022, 12:32 PM

SSరాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ నటించిన 'RRR' సినిమా మార్చి 25,2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.ఈ హై బడ్జెట్  యాక్షన్ డ్రామా నిర్మాతలు మళ్లీ ప్రమోషన్‌లను ప్రారంభించారు.ఈ భారీ బడ్జెట్ మూవీలో అలియా భట్,సముద్రఖని,అజయ్ దేవగన్,శ్రియా శరణ్,ఒలివియా మోరిస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.MM కీరవాణి ఈ  చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.హిందీ,తమిళం,మలయాళం అండ్ కన్నడ భాషలలో కూడా ఈ సినిమా విడుదల కానుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం,ఈ మూవీలో 'ఎత్తరా జెండా' పాటను మార్చి 14న విడుదల చేయనున్నట్లు సమాచారం.డివివి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డివివి దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa