ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తూఫాన్ అలర్ట్ ప్రకటించిన కెజిఎఫ్ చిత్రబృందం...

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 18, 2022, 04:08 PM

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హీరో యష్ నటించిన చిత్రం కెజిఎఫ్. 2018లో విడుదలైన ఈ సినిమా దేశాన్ని ఒక ఊపు ఊపేసింది. సెన్సేషన్ హిట్ అయింది. దీంతో ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కించాలనుకున్నారు దర్శక నిర్మాతలు. దీంతో  కెజిఎఫ్ చాప్టర్ 2 తెరపైకొచ్చింది. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా పలు మార్లు వాయిదా పడింది. భారీ అంచనాల నడుమ  ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా నుండి ఓ అదిరిపోయే అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ సినిమాలో తొలి లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. తూఫాన్ అనే తొలి లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ మార్చి 21న ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 


ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోండగా, బాలీవుడ్ నటి రవీనా టండన్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. హొంబాలే ఫిలింస్ బ్యానర్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa