టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ప్రాజెక్ట్స్ లో ఒక్కటైనా 'రావణాసుర' సినిమాలో యంగ్ హీరో సుశాంత్ అక్కినేని కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.ఈ యంగ్ హీరో బర్త్ డే సందర్భంగా ఈ యాక్షన్ డ్రామా నిర్మాతలు కొత్త పోస్టర్‌ను విడుదల చేసారు. స్పెషల్ పోస్టర్‌లో సుశాంత్ నీలి కళ్ళు,పొడవాటి జుట్టు అండ్ గడ్డంతో కనిపిస్తున్నారు.RT టీమ్ వర్క్స్ అండ్ అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌లపై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.ఈ యాక్షన్ డ్రామాలో రవితేజ లాయర్‌గా కనిపించనున్నాడు.సుధీర్ వర్మ డైరెక్షన్ లో రానున్న ఈ సినిమాలో మేఘా ఆకాష్,అను ఇమ్మాన్యుయేల్,ఫారియా అబ్దుల్లా కథానాయికలుగా నటిస్తున్నారు.'రావణాసుర' సినిమా సెప్టెంబర్ 30,2022న ప్రేక్షకుల ముందుకు రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa