ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన చిత్రం KGF2. ఈ సినిమా కేజీఎఫ్ చాప్టర్‌కి సీక్వెల్. కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ తోనే సౌత్ నాటాలోనే కాకుండా యావత్ ఇండియా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
ఈ సినిమా ప్రమోషన్స్‌ని వేగవంతం చేసింది చిత్ర యూనిట్. తాజాగా ఈ చిత్రంలోని తుఫాను పాటను విడుదల చేయగా, ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను మార్చి 27న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమా కేవలం కన్నడలోనే కాకుండా తెలుగు, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa