టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ఒక చిత్రంలో నటిస్తున్నారన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. బాలయ్య సినీ కెరీర్లో ఇది 107వ సినిమా కావడంతో NBK #107 గా పిలుస్తున్నారు. ప్రస్తుతానికిది వర్కింగ్ టైటిల్ మాత్రమే.
గోపీచంద్ మలినేని, బాలయ్య గత చిత్రాలు క్రాక్, అఖండ రెండు బ్లాక్ బస్టర్లే. వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా కావటంతో ప్రేక్షకులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా నుండి అప్డేట్ లు కూడా వస్తున్నాయి. ఇటీవల విడుదల చేసిన బాలయ్య రగ్డ్ లుక్ కు ప్రేక్షకుల నుండి విపరీతమైన స్పందన వచ్చింది. ఇంకా ఈ సినిమాలో మలయాళ స్టార్ యాక్టర్ దునియా విజయ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి మరొక అప్డేట్ బయటకు వచ్చింది. దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట నిర్మాతలు. ఈలోపు షూటింగును పూర్తి చేసి, ప్రచారకార్యక్రమాలను కూడా భారీగా చేయాలనే ఆలోచనలో ఉన్నారట చిత్రబృందం. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
వేటపాలెం లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో శృతిహాసన్ కధానాయిక కాగా వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య డ్యూయెల్ రోల్ లో నటించనున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa