వివేక్ అగ్నిహోత్రి ఒక రకమైన సంచలనం సృష్టించిన సినిమా "ది కాశ్మీర్ ఫైల్స్". విడుదలైన మొదటి రోజు నుండే ఈ చిత్రానికి అటు మీడియాలోనూ, ఇటు ట్రేడ్‌లోనూ విపరీతమైన ఆదరణ లభిస్తోంది. కాశ్మీరీ పండిట్‌ల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద 234 కోట్ల మార్క్‌ను అధిగమించి అద్భుతమైన ఫీట్‌గా నిలిచింది. ఇప్పుడు విడుదలైన ఆర్ఆర్ఆర్ కలెక్షన్లపై కాస్త ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఆదివారం రూ.3.5 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాకు వస్తోన్న వసూళ్లతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 250 కోట్ల మార్క్ ని ఈజీగా టచ్ చేస్తుందని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa