దాదాపు పదకొండేళ్ల తరవాత మళ్ళీ ఇప్పుడు త్రివిక్రమ్-మహేష్ ల సూపర్ హిట్ కాంబోలో ఒక సినిమా రానుంది. వీరిద్దరి కలయికలో 2005లో వచ్చిన అతడు ఎంత సూపర్ హిట్టో అందరికీ తెలిసిందే. ఆ తరవాత 2010లో వచ్చిన ఖలేజా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ వీరిద్దరి కాంబో పై ప్రేక్షకులలో మంచి అంచనాలున్నాయి.
ప్రస్తుతం పరశురామ్ డైరెక్షన్ లో సర్కారువారిపాట సినిమా షూటింగుతో బిజీగా ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ మూవీ షూటింగ్ అంతిమ దశకు వచ్చేసింది. వేసవి కానుకగా ఈ సినిమా మే 12న విడుదలకు రెడీగా ఉంది. ఆ వెంటనే మహేష్-త్రివిక్రమ్ ల మూవీ స్టార్ట్ అవుతుంది. ఈ మూవీ పై రోజుకొక ఇంటరెస్టింగ్ న్యూస్ హల్చల్ చేస్తుంది. తాజాగా ఈ మూవీ అప్డేట్ ఒకటి నెట్టింట షికారు చేస్తుంది. మహేష్ 28వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలోని ఒక ముఖ్యమైన పాత్రలో కన్నడ స్టార్ ఉపేంద్ర నటించనున్నారట. ఈ మేరకు త్రివిక్రమ్ ఉపేంద్రతో చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. ఈ విషయమై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువరించనున్నారట దర్శకుడు త్రివిక్రమ్. త్రివిక్రమ్ గత చిత్రం సన్నాఫ్ సత్యమూర్తి లో దేవరాజ్ గా నటించిన ఉపేంద్ర సినిమాకే హైలైట్ గా నిలిచారు. ఇప్పుడదే తరహాలో మహేష్-త్రివిక్రమ్ మూవీలోనూ ఉపేంద్ర పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని చిత్రవర్గ సమాచారం.
SSMB#28 వర్కింగ్ టైటిల్ తో ఇటీవలే ప్రారంభ పూజా కార్యక్రమాన్ని జరుపుకుంది ఈ సినిమా. ఏప్రిల్ నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటించే అవకాశాలున్నాయంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa