పూరి జగన్నాధ్... టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కమ్ రైటర్. పోకిరి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేసిన పూరి, సినిమాలో హీరోయిజం చూపించటంలో దిట్ట. తాజాగా నిన్న జరిగిన JGM సినిమా లాంఛ్ ఈవెంటులో పాల్గొన్న పూరి, ఆ సినిమాకు సంబంధించి చాలా విషయాలను పంచుకున్నారు. కానీ ఒక మేజర్ విషయాన్ని మాత్రం దాచేసారని టాక్. దర్శకుడు పూరి జగన్నాధ్ మరో దర్శకుడు రాజమౌళితో పోటీపడుతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే సినిమా బడ్జెట్, బాక్సాఫీస్ కలెక్షన్ల విషయంలో కాకుండా మరో విషయంలో జక్కన్నతో పూరి పోటీకి దిగనున్నారట.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 1,2, ఆర్ ఆర్ ఆర్ సినిమాల విజువల్ ఎఫెక్ట్స్ ఒక బెంచ్ మార్క్ గా నిలిచాయి. ఆర్ ఆర్ ఆర్ లో పులితో తారక్ ఫైట్, చరణ్ ఇంట్రో సీన్ లు ఎంతో సహజంగా కనిపిస్తాయి. కొంచెం కూడా అనుమానం రాదు అవి గ్రాఫిక్స్ అని. అచ్చు ఇలానే పూరి కూడా చేయాలనుకుంటున్నారట. పూరి డ్రీం ప్రాజెక్ట్ గా తెరకెక్కనున్న JGM మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో నడిచే కధ. అందుకోసం మిలిటరీ ట్యాంకర్లు, బాంబర్లు,ఇంకా చాలా వెహికల్స్ అవసరం ఉంటుంది. అటువంటి వాహనాలను సిటీ లో ల్యాండ్ చేసి షూటింగ్ చేయటం అసాధ్యం. దీంతో వీటన్నిటిని కూడా విజువల్ గా క్రియేట్ చేయాలనుకుంటున్నారట పూరి. ఇందుకోసం సింగపూర్, కెనడా వంటి దేశాలలో ఈ సినిమాకు సంబంధించి VFX పనులు చేయించనున్నారట. దీంతో JGM సినిమా మరింత సహజత్వంతో పేక్షకులకు చేరువవుతుందని అనుకుంటున్నారు.
ఒకవేళ పూరి కనక ఆయన అనుకున్నది సాధిస్తే, విజువల్ ఎఫెక్ట్స్ లో రాజమౌళి కి పూరి నుండి గట్టి పోటీ ఎదురవనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa