ముంబైలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలీవుడ్ నటి మలైకా అరోరాకు గాయాలయ్యాయి. దీంతో ఆమెను నవీ ముంబై ప్రాంతంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. పుణెలోని ఓ ఫ్యాషన్ షోలో పాల్గొని తిరిగి వస్తుండగా శనివారం రోడ్డు ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనలో మలైకాకు గాయాలయ్యాయని, ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోందని వెల్లడించారు. స్వల్పగాయాలే తగిలాయని, ఆమెను ఆదివారం డిశ్చార్జ్ చేస్తారని మలైకా సోదరి అమృతా అరోరా చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa