టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' సినిమా మార్చి 11న విడుదలైంది. రాధాకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ లో ప్రభాస్ సరసన సిజ్లింగ్ బ్యూటీ పూజాహెడ్గే జంటగా నటించింది. ఈ సినిమాలో జగపతిబాబు, కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'రాధేశ్యామ్' పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమా థియేట్రికల్ విడుదల తర్వాత కేవలం మూడు వారాలకే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారానికి అందుబాటులోకి వచ్చింది. తాజా రిపోర్ట్స్ ప్రకారం, అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాని ముందుగానే OTT విడుదలను నిర్వహించడానికి 'రాధేశ్యామ్' నిర్మాతలకు 25 కోట్లు చెల్లించింది. యువి క్రియేషన్స్ ఈ హై బడ్జెట్ సినిమాని నిర్మిస్తుంది. ఈ పీరియడ్ రొమాంటిక్ డ్రామాకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa