నందమూరి నటసింహం బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి కాంబోలో వచ్చిన మూడో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం 'అఖండ'. అంతకుముందు వీరి కాంబోలో వచ్చిన 'సింహా', 'లెజెండ్' కూడా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా థియేటర్లలో సినిమాలను విడుదల చేయటానికి భయపడుతున్న చిత్రసీమకు 'అఖండ' సినిమా చాలా పెద్ద రిలీఫ్ నిచ్చింది. పాండెమిక్ తరవాత విడుదలైన తొలి విజయవంతమైన సినిమాగా అఖండ మంచి పేరు తెచ్చుకుంది. బాలయ్య ద్విపాత్రాభినయం, ఆయన చెప్పే పవర్ఫుల్ డైలాగులు, బోయపాటి మార్క్ ఎలివేషన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఇకపోతే ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా ప్రగ్యా జైస్వాల్ నటించగా, జగపతిబాబు, శ్రీకాంత్ కీలకపాత్రల్లో నటించారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించగా, థమన్ తన మ్యూజిక్ తో అరిపించేసాడు.
థియేటర్లలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా తాజాగా బుల్లితెర మీద కూడా సందడి చేయటానికి రెడీ అయింది. వరల్డ్ ప్రీమియర్ టెలివిజన్ షో గా ఈ సినిమాను ఏప్రిల్ 10న స్టార్ మా టీవీ ఛానెల్ లో టెలికాస్ట్ చేసేందుకు రంగం సిద్ధం అవుతుంది. థియేటర్లో మోతమోగిన బాలయ్య డైలాగులు ఏప్రిల్ 10 నుండి మన ఇంటిలో కూడా వినబడనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa