ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్ 'బీస్ట్' కు తమిళనాడులో కూడా చుక్కెదురు...!

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 06, 2022, 08:58 PM

వరుణ్ డాక్టర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన పాన్ ఇండియా మూవీ బీస్ట్. పూజా హెగ్డే కధానాయిక. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కళానిధి మారన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం ఏప్రిల్ 13 న విడుదలకానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి. ఈ మూవీ లోని అరబిక్ కుతూ పాట ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే.


తాజాగా ఈ సినిమాకు తమిళనాడులో చుక్కెదురైంది. ముస్లింలను ఉగ్రవాదులుగా చిత్రీకరించారంటూ ఈ సినిమాను తమిళనాడులో విడుదల చేయకుండా ఆ రాష్ట్ర ముస్లిం లీగ్ అధ్యక్షుడు ముస్తఫా అడ్డుకుంటుంటున్నారు. ఈ మేరకు ఒక లేఖను కూడా తమిళనాడు రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి కి ముస్తఫా వ్రాసారు. ఇంతకుముందు బీస్ట్ సినిమాను కువైట్ లో కూడా నిషేధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు విజయ్ సొంత రాష్ట్రంలోనే నిరసనలు వెల్లువెత్తుతుండటంతో ఏప్రిల్ 13న ఈ సినిమా విడుదల అవుతుందా?లేదా? అని అంతటా ఆసక్తి నెలకొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa