ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమంత చేతుల మీదగా...'కృష్ణ వ్రింద విహారి' నుంచి సాంగ్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 09, 2022, 02:50 PM

హీరోయిన సమంత చేతుల మీదగా 'కృష్ణ వ్రింద విహారి' సినిమా నుంచి ఓ పాటను విడుదల చేశారు. నాగశౌర్యకి లవర్ బాయ్ గా యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఈ మధ్య కాలంలో ఆయన 'వరుడు కావలెను' మినహా యాక్షన్ సినిమాలు ఎక్కువగా చేస్తూ వచ్చాడు. దాంతో గతంలో మాదిరిగా ఆయన మళ్లీ లవ్ స్టోరీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు సోషల్ మీడియా ద్వారా వ్యక్తమవుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన 'కృష్ణ వ్రింద విహారి' సినిమా చేశాడు. తన సొంత బ్యానర్ 'ఐరా' క్రియేషన్స్ పై ఆయన ఈ సినిమాను నిర్మించాడు. అనీష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చాడు. తాజాగా ఈ సినిమా నుంచి సమంత చేతుల మీదుగా ఒక సాంగ్ ను రిలీజ్ చేయించారు.    'రా .. వెన్నెల్లో వర్షంలా .., రా .. వర్షంలో వెన్నెల్లా ..' అంటూ ఈ పాట సాగుతోంది. శ్రీమణి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను సంజన - ఆదిత్య ఆలపించారు. మత్తుగా .. రొమాంటిక్ గా అనిపించేలా ఈ పాటను ట్యూన్ చేసిన తీరు .. పాడించిన తీరు ఆకట్టుకుంటుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa