దర్శకధీరుడు రాజమౌళిపై కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ నెల 14 కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా, యష్ హీరోగా తెరకెక్కిన వస్తున్న కేజీఎఫ్-2 ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అవుతోంది. దీనికి సంబంధించి సోమవారం ప్రచార సభలో ఆయన మాట్లాడారు. దక్షిణాది డైరెక్టర్లు, సినీ వర్గాలు అందరూ రాజమౌళికి థ్యాంక్స్ చెప్పాల్సిందేనన్నారు. ఒకప్పుడు సౌత్ సినిమాలు బాలీవుడ్‌లో విడుదల చేయాలంటే అందుకు మార్గం చాలా ఇరుగ్గా ఉండేదన్నారు. రాజమౌళి దానిని ఎక్స్‌ప్రెస్ హైవేగా మార్చేశారని కొనియాడారు. తనకు ఆయన స్ఫూర్తి అని, సౌత్ ఇండియా సినిమా స్థాయిని రాజమౌళి పెంచారని చెప్పారు.