టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం ఆరు సినిమాలతో బిజీగా ఉన్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా 2014లో వచ్చిన 'కార్తికేయ' మంచి విజయం సాధించింది. త్వరలో ఈ చిత్రానికి సీక్వెల్ 'కార్తికేయ 2' రాబోతున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ చిత్రాన్ని జూలై 2న విడుదల చేయనున్నట్లు తాజా ప్రకటన. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa