ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విడుదల తేదీని లాక్ చేసిన నిఖిల్ 'కార్తికేయ 2'

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 12, 2022, 01:05 PM

పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన '18 పేజెస్' సినిమాలో యంగ్ అండ్ టాలెంటెడ్ టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ కనిపించనున్నారు. మరోవైపు 'కార్తికేయ 2' సినిమా షూటింగ్‌లో కూడా బిజీగా ఉన్నాడు. మిస్టరీ థ్రిల్లర్‌ ట్రాక్ లో రానున్న ఈ సినిమా  2014లో విడుదలైన 'కార్తికేయ' చిత్రానికి సీక్వెల్. తాజాగా మూవీ మేకర్స్ జూలై 22, 2022న గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు ప్లాన్  చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రకటించేందుకు సరికొత్త పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్‌లో జరుగుతోంది. ఈ సినిమాలో నిఖిల్ సరసన  అనుపమ పరమేశ్వరన్ జోడిగా నటిస్తుంది. ఈ చిత్రానికి కాల భైరవ సంగీత అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa