టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా రేసుగుర్రం. 2014లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ సినిమాలో దర్శకుడు సురేందర్ రెడ్డి హీరో క్యారెక్టర్ ను డిజైన్ చేసిన తీరు కొత్తగా ఉంటుంది.
అయితే తాజాగా ఈ కాంబో మళ్ళీ రిపీట్ అవనుందని చిత్రసీమలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటికే పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నాడు బన్నీ. ప్రస్తుతం పుష్పా 2 తో బిజీగా ఉన్న బన్నీ, ఆ తరవాత సురేందర్ డైరెక్షన్ లో మూవీ చేస్తారని అంతా అనుకుంటుండగా, ఇది కేవలం పుకారే అని, ఈ వార్తలో ఎటువంటి నిజం లేదని బన్నీ సన్నిహితులు తేల్చి చెప్పేసారు.
ప్రస్తుతం అక్కినేని అఖిల్ తో ఏజెంట్ మూవీ ని తెరకెక్కిస్తున్నాడు సురేందర్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని ఆగస్టులో విడుదల చేయనున్నారు. అయితే ఆ తరవాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను సురేందర్ డైరెక్ట్ చేస్తారు. పవన్ సన్నిహితులు నిర్మించబోతున్న ఈ మూవీ ఇప్పటికే కన్ఫర్మ్ అయింది. సో... ఇప్పట్లో రేసుగుర్రం కాంబోలో మరో మూవీ లేనట్టే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa