ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేణు దేశాయ్ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 26, 2018, 11:12 AM

పవన్ కళ్యాణ్ మాజీ భార్య, ఒకప్పటి హీరోయిన్ రేణు దేశాయ్ ఈ మధ్యే తన కొత్త జీవిత భాగస్వామిని ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఈ అంశం పై పవన్ అభిమానులు పలు రకాలుగా స్పందిస్తూ ఉండగా కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ కూడ స్పందించారు.ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించిన ‘ఆయన కొత్త జీవితంలోకి ప్రవేశిస్తున్న రేణు దేశాయ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. భగవంతుడు, ప్రకృతి ఆమెకు శాంతిని, ఆరోగ్యాన్ని, శ్రేయస్సుని అందివ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు. పవన్ ఇంత హుందాగా, గౌరవప్రదంగా స్పందించడం పట్ల అభిమానులు తన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa