ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాలుగోసారి కాంబినేష‌న్‌

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 28, 2018, 03:28 PM

హిట్‌ కాంబినేషన్‌లతో సినిమాలను తీసేందుకు పరిశ్రమ ఎంతో ఆసక్తిని కనబరుస్తుంటుంది. దానివల్ల ప్రేక్షకలోకంలో కూడా అంచనాలు బలంగా నెలకొంటాయని..ఆ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు వస్తారని పరిశ్రమలో విశ్వసించడం ఎప్పట్నుంచో ఉన్నదే. ఈ క్రమంలో వెంకటేష్‌, నయనతార జంటకు మంచి క్రేజ్‌ ఉండటమే కాదు వారిద్దరూ నటించిన మూడు సినిమాల్లో ఘన విజయం సాధించాయి. లక్ష్మి, తులసి వంటి హిట్‌ చిత్రాల తర్వాత వారు నటించిన బాబు బంగారం అనుకున్నంతగా ఆడకపోయినా ఆ క్రేజ్‌ మాత్రం పదిలంగానే ఉందంటారు. తాజాగా వారిద్దరూ కలిసి నాలుగో చిత్రం చేయబోతున్నట్లు పరిశ్రమలో వినిపిస్తోంది. ప్రస్తుతం ఎఫ్‌ 2 చిత్రంలో నటిస్తున్న వెంకటేష్‌ దాని తర్వాత నాగచైతన్యతో కలిసి బాబి (కె.ఎస్‌.రవీంద్ర) దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించబోతున్నారు. దీనికి వెంకీ మామ అనే టైటిల్‌ కూడా పరిశీలనలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపొందే ఈ చిత్రంలో వెంకటేష్‌ సరసన హ్యూమాఖురేషి నటించబోతున్నట్లు ఆ మధ్య వినిపించింది కానీ తాజాగా అందిన సమాచారం ప్రకారం నయనతార నటించనున్నట్లు తెలిసింది. దక్షిణాదిలో తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలలో నటిస్తున్న ఆమె తమిళ చిత్రాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలియంది కాదు. ప్రస్తుతం తమిళంలో ఐదు చిత్రాలలో నటిస్తుంటే…తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి సైరా…చిత్రంలో మాత్రమే నటిస్తున్న ఆమె ఇప్పుడు తెలుగులో వెంకటేష్‌ చిత్రాన్ని కూడా అంగీకరించినట్లు సమాచారం






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa