కొరటాల శివ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ "ఎన్టీఆర్ 30" సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నట్లు సమాచారం. 'ఎన్టీఆర్ 30' సినిమా షూటింగ్ జూన్ నెలలో జరగనుంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా మూవీ మేకర్స్ ప్రకటించలేదు. తాజాగా ఇప్పుడు, 'ఆచార్య' ప్రమోషన్స్‌లో కొరటాల శివ మాట్లాడుతూ..... 'ఎన్టీఆర్30' సినిమా ఫుల్ మాస్ డ్రామాగా ఉంటుందని మరియు అభిమానులకు ట్రీట్ అవుతుందని అన్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ని చూపించిన విధానం అద్భుతంగా ఉంటుందని, క్యారెక్టరైజేషన్ చాలా బాగా వచ్చిందని దర్శకుడు చెప్పారు. 2023 ప్రారంభంలో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలోనే వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa