ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొరటాల - తారక్ మూవీ హీరోయిన్ పై సందిగ్ధత... ఫైనలైజయ్యే బ్యూటీ ఎవరో?

cinema |  Suryaa Desk  | Published : Wed, May 04, 2022, 10:07 PM

'ఆర్ఆర్ఆర్' గ్రాండ్ సక్సెస్ తర్వాత జూనియర్ ఎన్టీయార్ కొరటాల శివ తో సినిమా చేయటానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఆలియా భట్ ఫిమేల్ లీడ్ లో నటిస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో ఆలియా ధ్రువీకరించింది కూడా.  అయితే, అనుకోని కారణాల వల్ల ఆలియా ఈ ప్రాజక్టు నుంచి తప్పుకుందని , ఆమె ప్లేస్ లో నేషనల్ క్రష్ రష్మిక మండన్నా ను చిత్రబృందం ఎంపిక చేసినట్టు కూడా ఆ తర్వాత వార్తలు వచ్చాయి. తాజాగా ఈ మూవీ హీరోయిన్ గా మరో పేరు కూడా వినిపిస్తుంది. ఆమెనే డ్యాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి. టాలీవుడ్ ది బెస్ట్ డ్యాన్సర్లలో తారక్ ఒకరు. అలాంటి తారక్ తో సాయి పల్లవి జత కుదిరితే.... స్క్రీన్ పై మెరుపులే. నువ్వా నేనా అన్నట్టుగా వీరిద్దరి మధ్య డ్యాన్స్ పోటీ జరుగుతుందేమో! ఈ వార్త పట్ల తారక్ అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వార్తలలో నిజానిజాలు తెలియాలంటే, మే 20 వరకు ఆగాల్సిందే. ఎందుకంటే... ఆ రోజు తారక్ బర్త్ డే ను పురస్కరించుకుని న్యూ మూవీ ఎనౌన్సమెంట్ రాబోతుంది. ఈ వార్తను దర్శకుడు కొరటాల శివ స్వయంగా వెల్లడించారు. చూద్దాం... ఆ రోజునైనా తారక్ సరసన నటించే లక్కీ గర్ల్ ఎవరన్నది తెలుస్తుందేమో?






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa