ఇటీవల సినిమాలకు సంబంధించి పాటల విడుదల ఓ ట్రెండ్ గా మారింది. ఇదిలావుంటే నాగశౌర్య - షిర్లే సెటియా జంటగా నటించిన ప్రేమకథా చిత్రమే 'కృష్ణ వ్రింద విహారి'. నాగశౌర్య తన బ్యానర్లో నిర్మించిన ఈ సినిమాకి అనీశ్ కృష్ణ దర్శకత్వం వహించాడు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిర్మితమైన సినిమా ఇది. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఇంతకుముందు ఈ సినిమా నుంచి ఒక సాంగును రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ నేపథ్యంలో తాజాగా మరో సాంగును వదిలారు. 'ఏముందిరా ఈ అద్భుతాన్ని చూడు .. మారిందిరా అందం చరిత్ర నేడు' అంటూ ఈ పాట సాగుతోంది. హీరో .. ఫారిన్ లో పుట్టిపెరిగిన హీరోయిన్ ను వెంటబెట్టుకుని తన విలేజ్ కి తీసుకుని వస్తాడు. ఇక్కడి వాళ్లంతా ఆమెకి ఆప్యాయంగా ఆహ్వానం పలుకుతారు. ఆ సంతోషంలో హీరో పాడుకునే పాట ఇది.
హర్ష సాహిత్యాన్ని అందించిన ఈ పాటను హరిచరణ్ ఆలపించాడు. విజయ్ బిన్నీ కొరియోగ్రఫీని అందించాడు. సాహిత్యం .. ట్యూన్ .. అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ నెల 20వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. వరుస ఫ్లాపులతో ఉన్న నాగశౌర్యకి ఈ సినిమా ఊరటనిస్తుందేమో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa