టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సినిమా 'సర్కారువారిపాట'. పరశురామ్ డైరెక్షన్లో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమాలో కీర్తిసురేష్ కధానాయిక. ఈ సినిమాకి థమన్ సంగీతం అందించారు. ఈ సినిమా టికెట్ ధరలను పెంచుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ సినిమా టిక్కెట్ ధరలను పెంచేందుకు ప్రభుత్వం అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.మల్టీప్లెక్స్ లు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50, ఎయిర్ కండిషన్డ్ థియేటర్లలో రూ.30 పెంచుతున్నారు.దీంతో పాటు అదనపు షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ సినిమా మే 12 న విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa