ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు అవతార్-2

cinema |  Suryaa Desk  | Published : Mon, May 09, 2022, 10:38 PM

ఈ ఏడాది డిసెంబర్ 16న సినీ ప్రేక్షకుల ముందుకు అవతార్-2 సినిమా రాబోతోంది. ప్రపంచ వెండితెరపై అవతార్ చిత్రం సృష్టించిన ప్రభంజనం అంతాఇంతా కాదు. అనేక భాషల్లోకి డబ్ అయిన ఈ చిత్రం నిర్మాతలకు డాలర్ల వర్షం కురిపించింది. 2009లో జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో వచ్చిన అవతార్ ఆస్కార్ వేదికపైనా అవార్డులు కొల్లగొట్టింది. ఈ చిత్రానికి సీక్వెల్ వస్తోంది. అవతార్-2 ఈ ఏడాది డిసెంబరు 16న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.


తాజాగా అవతార్-2కి చెందిన టీజర్ ట్రైలర్ ను చిత్రబృందం సోషల్ మీడియాలో పంచుకుంది. ఈసారి అవతార్ లో సముద్ర లోకాన్ని ఆవిష్కరించినట్టు టీజర్ ట్రైలర్ చెబుతోంది. అద్భుతమైన గ్రాఫిక్స్ మాయాజాలం అడుగడుగునా దర్శనమిస్తోంది. మొత్తమ్మీద టీజర్ ట్రైలర్ తోనే అవతార్-2పై అమితమైన ఆసక్తి రేకెత్తించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa